ఎర్రచందనం ముఠాను కడప జిల్లాలో ఎస్పీ రవి శంకర్ ఆధ్వర్యంలో కుంబింగ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రైల్వేకోడూరు మండలం చియ్యవరం పంచాయతీ పరిధిలోని యన్వీఎస్ గిరిజన కాలనీ సమీపంలో మామిడితోటలో తరలించడానికి సిద్ధంగా ఉన్న 22 ఎర్రచందన దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లు శ్రీకాంత్, శ్రీహరి, పెంచలయ్య, మనోహర్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి మందుగుండును స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:పర్యావరణహితాన్ని 'వెదురు' వెళ్లి స్వాగతం పలుకుదాం...