ETV Bharat / state

'విధులు వేశారు...రిజర్వులో ఉంచారు' - ఎమ్మెల్సీ బీటెక్ రవి

కడప జిల్లా పులివెందుల్లో ఎన్నికల విధుల నిర్వర్తించడానికి వచ్చిన సిబ్బందిని రిజర్వులో ఉంచటంతో వారు జేఎన్టీయూ కళాశాల బయట ధర్నా చేశారు.

ఎన్నికల సిబ్బంది ధర్నా
author img

By

Published : Apr 11, 2019, 5:38 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనేందుకు కడప జిల్లా పులివెందులకు చేరుకున్న రిజర్వు ఎన్నికల సిబ్బంది...జేఎన్టీయూ కళాశాల బయట రోడ్డు మీద ధర్నా చేశారు. తమను విధులకు వేసి...రిజర్వులో ఉంచారని వారు ఆందోళన చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రవర్తన సరిగ్గా లేదని...ఉదయం నుంచి ఇక్కడే వేచి ఉన్నా తీరా ఇప్పుడు రాత్రి 8 గంటలకు ..మీరు ఇళ్లకు వెళ్లి తిరిగి ఉదయం వచ్చి రిపోర్టు చేయమని చెప్తున్నారని వారు అన్నారు. ఈ సమయంలో మేం ఎక్కడికి వెళ్లి ఉండేదని, ఉదయం నుంచి కనీసం నీరు కూడా ఏర్పాటు చేయలేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి వాహనాన్ని అడ్డుకోవడంతో ఆయన సమస్యను అడిగి తెలుసుకున్నారు. కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని రవి కోరారు.

ఇవి చూడండి...

పల్లె రఘునాథరెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Intro:Ap_gnt_61_10_poling_stations_vachina_officers_av_g4

Anchor : సార్వత్రిక ఎన్నికలు గురువారం జరగనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. బారికెట్స్, ఎండకు ఇబ్బంది లేకుండా షామియాన ఏర్పాటు చేశారు. సాయంత్రానికి చేరుకోవాల్సిన సిబ్బంది రాత్రి 9 తరువాత కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని తీసుకువచ్చారు.

Body:vo : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎన్నికలకు ఏర్పాట్లు అధికారులు సిద్ధం చేశారు. నియోజకవర్గంలో 2లక్షల 50వేల 247మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 1,21,553 , స్త్రీలు 1,28,662 మంది ,ఇతరులు 32 మంది వున్నారు. 7109 మంది మహిళా ఓటర్లు అధికంగా వున్నారు. నియోజకవర్గంలో 283 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. 1937 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. 80 సమస్యాత్మక గ్రామాలు గుర్తించారు. 150 ప్రాంతాలలో మైక్రో పరిశీలకులను నియమించారు. 400 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వీడియో గ్రాఫర్ వుంటారు. 2014 ఎన్నికల్లో నియోజకవర్గంలో2,25,958 మంది ఓటర్లు ఉండగా ఇప్పుడు మరో 24,289 మంది ఓటర్లు పెరిగారు.

Conclusion:end...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.