తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తమ పిల్లలతో కలిసి ఆందోళన చేపట్టారు. కడప జిల్లా రాజంపేటలోని విద్యుత్ డివిజన్ కార్యాలయ ప్రధాన ద్వారం నుంచి తమ పిల్లలతో కలిసి కార్మికులు నిరసన ర్యాలీ చేశారు. 'జగన్ మామయ్య ..! మా తండ్రులు ఎన్నో ఏళ్లుగా విద్యుత్ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు.. అందరినీ పర్మినెంట్ చేయండి..' అంటూ కార్మికుల పిల్లలు సీఎంను వేడుకున్నారు.
సీఎం జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా చేస్తామని హామీ ఇచ్చారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రవికుమార్ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇంతవరకు కార్మికుల ఊసే ఎత్తలేదన్నారు. కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకోవడం దారుణమన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరారు.
ఇవీ చూడండి.. 'మాస్కులు ఉంటేనే సరుకులు ఇవ్వండి'