మందుబాబులకు సాధారణ రోజులు ఓ ఎత్తు అయితే ఆదివారం మరో ఎత్తు. మద్యం కోసం కడపలో మందుబాబులు దుకాణాల వద్ద బారులు తీరారు. కనీసం భౌతిక దూరం పాటించకుండా నిలబడ్డారు. ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఇలా అయితే కరోనా సోకదా పలువురు ప్రశ్నిస్తున్నారు. మందుబాబులను ఆపడం ఎవరి వల్ల కావడం లేదంటున్నారు. మందు కోసం వచ్చినవారిలో చాలామంది మాస్కులు ధరించలేదంటున్నారు. ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే వారికి కరోనా రావడమే కాకుండా..అందరికీ వ్యాప్తి చెందే అవకాశముందని స్థానికులంటున్నారు.
ఇవీ చదవండి