కడప జిల్లా పరిధిలోని 6 రవాణా శాఖ కార్యాలయాల్లో గత నెలరోజుల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల కొరత ఏర్పడింది. రాష్ట్రస్థాయిలో ముద్రణ నిలిపివేయటంతో డ్రైవింగ్ కార్డుల సరఫరా ఆగిపోయింది. దీంతో జిల్లావ్యాప్తంగా వాహనదారులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కార్డులు ఎప్పుడు వస్తాయో అధికారులకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం పరీక్షలు నిర్వహించిన అనంతరం అదే రోజు సాయంత్రం పాసైన అభ్యర్థులకు డ్రైవింగ్ లైసెన్స్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తారు. కానీ ఆగస్టు 26 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు లేవు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. డ్రైవింగ్ పరీక్ష పాస్ అయిన అభ్యర్థులకు కార్డుల రూపంలో కాకుండా పేపర్ రూపంలో లైసెన్స్లు అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 5 వేల కార్డులు పెండింగ్లో ఉన్నాయి. కార్డులు సాధ్యమైనంత తొందరగా మంజూరు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
ఇవీ చదవండి..