ETV Bharat / state

ట్రైనీ ఐపీఎస్​పై వరకట్న వేధింపుల కేసు - DOWRY HARASSMENT CASE BOOKED ON TRAINEE IAS

ట్రైనీ ఐపీఎస్‌ అధికారిపై కేసు నమోదైంది. ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేశాడనే యువతి ఫిర్యాదు మేరకు మహేశ్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీఎస్‌ సెలక్ట్‌ అయ్యాక కట్నం కోసం వేధిస్తున్నాడని... యువతి ఆరోపించింది. ట్రైనీ ఐపీఎస్‌ మహేశ్‌రెడ్డిపై తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పోలీసులు వరకట్నం వేధింపుల కేసు నమోదు చేశారు.

ట్రైనీ ఐపీఎస్​పై వరకట్న వేధింపుల కేసు
author img

By

Published : Oct 29, 2019, 6:17 PM IST

వారిద్దరికీ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పటి నుంచి పరిచయం. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తొమ్మిదేళ్ల తర్వాత మహేశ్​ పెళ్లి చేసుకోమని అడగ్గా... ఇంట్లో ఎలా ఒప్పిస్తావంటూ ఆమె ప్రశ్నించింది. తాను ఐపీఎస్​గా సెలెక్ట్​ అయితే ఇంట్లో వారి అంగీకారం లభిస్తుందని చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఏడాది తర్వాత మహేష్​ ఐపీఎస్​కు ఎంపికయ్యాడు. అప్పుటినుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని బాధితురాలు వాపోయింది. కట్నం ఇవ్వాలంటూ... వేధించడం ప్రారంభించాడని ఆరోపించింది. అదనపు కట్నం తీసుకొస్తేనే కాపురం చేస్తానని లేకపోతే... వేరే అమ్మాయిని వివాహమాడతానని ఆమెను బెదిరించాడని చెబుతూ... తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జవహర్​నగర్​ పీఎస్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు.. మహేశ్​ రెడ్డిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని​ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.