కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు ప్రసాద్‌రెడ్డి (74) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని స్వగృహంలో మృతి చెందారు. ప్రసాద్‌రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వివాహం అనంతరం మొదటి కూతరు నీతా ప్రసాద్ అమెరికాలో ఉండగా, రెండో అమ్మాయి నిత్యా ప్రసాద్ హైదరాబాదులో స్థిరపడింది. ప్రసాద్‌రెడ్డి భార్య హేమలత కూడా ఆయనతో పాటూ ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తూ పట్టణంలో ప్రసాద్‌రెడ్డి పేరుగాంచారు. ఆయన మృతి పట్ల పలువురు వైద్యులు, ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఇది చదవండి కడపలో కరోనా తగ్గుముఖం.. 4 రోజుల్లో ఒకే కేసు నమోదు