DL RAVINDRA COMMENTS: సీఎం జగన్ జన్మదినం సందర్భంగా బైజూస్ కంటెంట్ తో విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడం ఓ కుంభకోణమని.. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డి అన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు ఇష్టారాజ్యంగా దోపిడీలు చేస్తూ, సహజ వనరులను కొల్లగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇసుక, మట్టి, ఎర్రమట్టి దేన్నీ వదలకుండా స్వాహా చేస్తున్నారని.. ఇవన్నీ సీఎం కు తెలిసే జరుగుతున్నాయని ఆయన అన్నారు. తాను ఇప్పటికీ వైసీపీలో ఉన్నప్పటికీ.. నేతల అరాచకాలు చూసి అసహ్యంతో పార్టీకి దూరంగా ఉంటున్నట్లు డీఎల్ తెలిపారు. అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే, ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే అవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికలల్లో టీడీపీ, జనసేన కలిస్తే బాగుంటుందన్న డీఎల్.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలతో పాటు తాను కూడా ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: