కడప జిల్లా ప్రొద్దుటూరులో.. తెదేపా కడప పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరులో కూరగాయల మార్కెట్‌ను కూల్చేందుకు పురపాలక అధికారులు సిద్ధమయ్యారు. జేసీబీలతో మార్కెట్ చెేరుకున్న అధికారులు కూల్చివేతను ప్రారంభించారు. కూల్చివేతను నిలిపేయాలని స్థానిక వ్యాపారులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా లింగారెడ్డి మార్కెట్లో బైఠాయించి ఆందోళన చేశారు. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. కూల్చివేతను నిలిపేయాల్సిందేనని పట్టుబట్టారు. ఆయనను పోలీసులు అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లింగారెడ్డితో పాటు భాజపా నేత బాలచంద్రారెడ్డి, సీపీఐ నేత రామయ్య, జనసేన నేత మాదాసు మురళిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: