DISPUTE BETWEEN POLICE AND YOUNG MAN : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పరిధిలోని దేవగుడి గ్రామానికి చెందిన వెంకటయ్య అనే యువకుడికి, నంద్యాల జిల్లాకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులతో వాగ్వాదం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 24వ తేదీన మండలంలోని దానవలపాడు వద్ద పాలకోవ సెంటర్లో ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ప్రస్తుతం అక్కడున్న సీసీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో చర్చనీయాంశమైంది.
వెంకయ్య అనే యువకుడు దేవగుడి నుంచి గొరిగనూరు గ్రామానికి వెళ్లే క్రమంలో పాలకోవ కొనుగోలు చేసేందుకు బండి ఆపాడు. ఇంతలోనే సీఎం బందోబస్తు నుంచి తిరిగి వెళ్తున్న పోలీసు అధికారులున్న వాహనం వేగంగా వచ్చి తనకు దగ్గరగా ఆగిందని యువకుడు ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై యువకుడితో పాటు బనగానపల్లె సీఐ సుబ్బరాయుడు, అవుకు ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి మధ్య వాదోపవాదాలు జరిగాయి. పక్కనే ఉన్న దుకాణంలో సీసీ కెమెరాల ఫుటేజీ వాట్సాప్‌లో హల్చల్ చేస్తోంది. జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజును వివరణ కోరగా ప్రస్తుతం తాను విజయవాడలో ఉన్నానని, ఈ విషయం తన దృష్టికి రాలేదని, ఫిర్యాదు చేయలేదన్నారు.
ఇవీ చదవండి: