ETV Bharat / state

DISHA APP: ఒక్క క్లిక్ చేసింది.. అపాయం నుంచి బయటపడింది - ఏపీ టాప్ న్యూస్

రాష్ట్రానికి చెందిన యువతి దిల్లీలో అపాయంలో ఉండగా దిశ యాప్ ద్వారా కడప పోలీసులు రక్షించారు. రెండ్రోజుల పాటు ఆమెకు అండగా ఉండి.. పరీక్ష రాసి ఇంటికి చేరేవరకు కంటికి రెప్పలా కాపాడారు.

disha-app-save-kadapa-women-at-delhi
ఒక్క క్లిక్ చేసింది.. అపాయం నుంచి తప్పించుకుంది..!
author img

By

Published : Sep 14, 2021, 4:26 PM IST

Updated : Sep 14, 2021, 4:57 PM IST

ఒక్క క్లిక్ చేసింది.. అపాయం నుంచి తప్పించుకుంది..!

కడప జిల్లాకు చెందిన యువతి దిల్లీలో అపాయంలో ఉండగా దిశ యాప్ ద్వారా పోలీసులు ఆమెను రక్షించారు. ఈనెల 11న ఉపాధ్యాయ నియామక పరీక్ష కోసం జిల్లాకు చెందిన సుభాషిణి రైల్లో దిల్లీకి వెళ్లింది. పరీక్షా కేంద్రానికి ఆటోలో వెళ్తుండగా.. ఆటో డ్రైవర్ తీరుపై అనుమానం వచ్చింది. అతని మాటలు, చేష్టలతో భయపడి.. ఆటో దిగి రైల్వేస్టేషన్​లోకి పరెగెత్తింది. వెంటపడిన ఆటో డ్రైవర్ నుంచి తప్పించుకుంది. ఈ సమయంలోనే భయంతో తన వద్దనున్న సెల్ ఫోన్​లో దిశ యాప్​లోని ఎస్.ఓ.ఎస్. బటన్ నొక్కింది.

వెంటనే కంట్రోలు రూం నుంచి కడప ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీకి సమాచారం వెళ్లింది. యువతితో మాట్లాడిన కడప పోలీసులు.. ధైర్యం చెప్పారు. దిల్లీ పోలీసుల సాయంతో యువతిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి.. పరీక్ష రాసి తిరిగి కడప వచ్చే వరకు పోలీసులు రక్షణగా ఉన్నారని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. దిల్లీకి ఒంటరిగా వెళ్లిన తనకు దిశ యాప్ ద్వారా పోలీసులు ఆపద నుంచి రక్షించారని సుభాషిణి అనే యువతి మీడియా ముందు వివరించింది.

ఇదీ చూడండి: కృష్ణంరాజు ఆరోగ్యంపై కుటుంబసభ్యుల కీలక ప్రకటన

Last Updated : Sep 14, 2021, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.