ETV Bharat / state

వివేకా హత్య కేసులో.. సీబీఐకి తప్పని తిప్పలు..! - CBI news

Viveka murder case: వివేకా హత్య కేసు సీబీఐకి ముళ్లకిరీటంలా మారింది. కేసు దర్యాప్తునకు సహకరించాల్సిన ప్రభుత్వం, పోలీసులే అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. ఏకంగా సీబీఐ దర్యాప్తు అధికారిపైనే కేసులు నమోదు చేయడంతో ఒకానొక దశలో దర్యాప్తు నిలిపివేసి అధికారులు రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన పరిస్థితులు ఉన్నాయి. సీబీఐ అధికారులకు చావు బెదిరింపులు వచ్చాయంటే ఈ కేసులో నిందితులకు తెరవెనక సహకరిస్తున్న వారు ఎంత పెద్దవాళ్లో అర్థమవుతోంది.

CBI in the investigation
CBI in the investigation
author img

By

Published : Nov 30, 2022, 7:49 AM IST

ఏపీలో సీబీఐ అధికారులకు చేదు అనుభవాలు

CBI in the investigation of Viveka murder case: దేశంలో అత్యున్నత నేర పరిశోధన సంస్థ సీబీఐకే రాష్ట్రంలో వైకాపా నేతలు, అధికార యంత్రాంగం చుక్కలు చూపించింది. మరెక్కడా లేని విధంగా సీబీఐ అధికారులు చేదు అనుభవాలు వారు ఎదుర్కొన్నారు. వివేకా హత్యకేసు దర్యాప్తు చేపట్టినప్పటి నుంచి వైకాపా నేతలు, ఏపీ ప్రభుత్వం, పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. సీబీఐని అష్టదిగ్బంధం చేశారు. ఈ కేసులో సీబీఐకి ఎవరైనా సాక్షులు వాంగ్మూలం ఇస్తే వారిని బెదిరించారు. సీబీఐ అధికారులు తమను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారంటూ వారితోనే ఎదురు కేసులు పెట్టించారు. బహుశా ఇంతటి దారుణమైన వారు ఇంకెక్కడా ఎదుర్కొని ఉండకపోచ్చు.

ఎఫ్‌ఐఆర్‌పై స్టే: కేసు కీలక దశకు చేరుకున్న తరుణంలో దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ రామ్‌సింగ్‌ తనను బెదిరిస్తున్నారని ఈ కేసులో అనుమానితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా దాని ఆధారంగా కేసు నమోదు చేశారు. చివరికి హైకోర్టు ఆదేశాలతో ఆ ఎఫ్‌ఐఆర్‌పై స్టే వచ్చింది.

పులివెందుల సీఐ శంకరయ్య సస్పెండ్: సీబీఐ బృందం వెంటనే కడప నుంచి వెళ్లిపోవాలని... లేకుంటే బాంబు వేసి పేల్చేస్తానంటూ ముసుగు ధరించిన వ్యక్తి సీబీఐ అధికారుల వాహన డ్రైవర్‌ షేక్‌ వలీ బాషాను బెదిరించాడు. అలాగే కోర్టు నుంచి వెళ్లేప్పుడు సీబీఐ అధికారులను అవినాశ్‌రెడ్డి అనుచరులు అడ్డుకునేందుకు యత్నించారు. రిమాండ్‌లో ఉన్న శివశంకర్‌రెడ్డిని మేజిస్ట్రేట్‌ అనుమతి లేకుండానే కడప సెంట్రల్‌ జైల్‌ నుంచి రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా వివేకా హత్య సమయంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య సస్పెండ్ కాగా....ఆయన 2021 సెప్టెంబర్ 28 సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఇదే విషయాన్ని మేజిస్ట్రేట్‌ ఎదుట చెప్పాలంటూ వారు సీబీఐ కోరగా నిరాకరించారు. ఆ తర్వాత వారం రోజులకే సీఐ సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది.

అవినాశ్‌రెడ్డి పేరు: ఈకేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి పేరు వచ్చినప్పటి నుంచి సీబీఐకి కష్టాలు రెట్టింపయ్యాయి. దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కోర్టు హాల్లోనే అడ్డుకున్నారు. తన అనుచరుడు శివశంకర్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేశావని ప్రశ్నించారు. కడప ఎంపీ సీటు విషయంలోనే అవినాశ్‌కు, వివేకాకు మధ్య విభేదాలు తలెత్తడంతో...అవినాశ్‌ తన అనుచరుడు శివశంకర్‌రెడ్డితో చంపించి ఉంటారని అనుమానాలు ఉన్నాయంటూ సీబీఐ తన ఛార్జిషీటులో తెలిపింది.

కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి అనుమానాస్పద మృతిగా: ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి 2019 సెప్టెంబరు 3న చనిపోయారు. తొలుత అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏం జరిగిందో ఇప్పటికీ నిగ్గుతేల్చలేదు . హత్యానేరాన్ని తనపై వేసుకుంటే 10 కోట్లు ఇస్తానని శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ ఇచ్చారంటూ సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి, తర్వాత మాట మార్చిన గంగాధర్‌రెడ్డి ఈ ఏడాది జూన్‌ 9న చనిపోయారు. దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సైతం తన ప్రాణాలకు ముప్పు ఉందని పదేపదే పోలీసులను వేడుకుంటున్నాడు. ఈ వ్యవహారాలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే...రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు సజావుగా సాగదన్న అభిప్రాయనికి వచ్చిన తర్వాతే కేసు విచారణను హైదరాబాద్‌కు మారుస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.