తిరుమలేశుని తొలి గడప దేవుని కడపలోని శ్రీ లక్ష్మి వేంటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలకు సకల దేవతల్ని ఆహ్వానించే విధంగా ధ్వజారోహణ చేపట్టారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను ఆహ్వానిస్తూ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ధ్వజారోహణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు శ్రీ వారికి ఇష్టమైన గరుడవాహనంపై 17న వీధులలో విహరించనున్నారు. 18న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుని కల్యాణం, 19న రథోత్సవం నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం