కడప నగరంలో కొవిడ్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా ఆదేశించారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మేయర్ సురేష్‌బాబుతో కలిసి పోలీసు అధికారులతో సమీక్షించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించేవిధంగా నిబంధనలు మరింత కఠినతరం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రజలు అనవసరంగా రహదారులపైకి రాకుండా, గుంపులుగా గుమికూడకుండా ప్రజలను చైతన్యపరచాలన్నారు. మధ్యాహ్నం 12 గంటల అనంతరం అనవసరంగా రహదారుల మీద తిరిగేవారిపై కఠిన చర్యలు తీసుకునేవిధంగా పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అనంతరం పలు అంశాలపై చర్చించి సూచనలిచ్చారు. సమీక్షలో సీఐలు సత్యనారాయణ, మహమ్మద్ అలీ, అశోక్‌రెడ్డి, నాగభూషణం పాల్గొన్నారు.
ఇదీ చదవండి: