ETV Bharat / state

'మైనారిటీ యువకులపై అక్రమ కేసులు ఎత్తేయడంపై త్వరలో నిర్ణయం'

ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా.. కడప జిల్లా రాయచోటిలోని ఓ హోటల్​ను ప్రారంభించారు. బక్రీద్ సమయంలో మైనారిటీ యువకులపై నమోదైన అక్రమ కేసులను ఎత్తేయడంపై.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం రచిస్తున్న ప్రణాళికలను వివరించారు.

deputy cm visit in rayachoti
హోటల్​ను ప్రారంభిస్తున్న ఉపముఖ్యమంత్రి
author img

By

Published : Nov 21, 2020, 7:24 PM IST

కడప జిల్లా రాయచోటిలో ఏర్పాటు చేసిన నూతన హోటల్​ను.. చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానంలతో కలిసి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రారంభించారు. అనంతరం బోస్​నగర్ ఠాణా కూడలిలోని జామియా మసీదులో ప్రార్థనలు చేశారు. మైనార్టీల సమస్యలపై ముస్లిం నాయకులతో చర్చించారు.

బక్రీద్ సమయంలో మైనారిటీ యువకులపై నమోదైన అక్రమ కేసులు తొలగించే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని అంజాద్​ బాషా తెలిపారు. త్వరలోనే మంత్రివర్గం ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. జూనియర్ కళాశాల మైదానంలోని వక్ఫ్ బోర్డ్ స్థలంపై చర్చించారు. పట్టణ అభివృద్ధి కోసం చేపట్టనున్న చర్యలను వివరించారు. మసీదుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: 'రాష్ట్ర రహదారులపై టోల్​ఫీజుల వసూళ్లు దారుణం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.