ETV Bharat / state

అర్హులందరికీ ఉగాది నాటికి ఇళ్ల స్థలాలిస్తాం: అంజద్​ బాషా - ఉగాది నాటికి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ

కడప శివారులోని అక్కాయపల్లెలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల ప్రాంతాన్ని ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా పరిశీలించారు. కడప నగరంలో 22 వేల మందికి ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు.

Deputy Chief Minister's visit to Akkayapalle in Kadapa
కడప శివారులోని అక్కాయపల్లెలో ఉపముఖ్యమంత్రి పర్యటన
author img

By

Published : Mar 7, 2020, 4:21 PM IST

కడప శివారులోని అక్కాయపల్లెలో ఉపముఖ్యమంత్రి పర్యటన

ఉగాది నాటికి రాష్ట్రంలోని 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే గుర్తిస్తున్నామన్న ఆయన.... అవసరమైతే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కూడా భూమిని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని గుర్తు చేశారు. కడప శివారులోని అక్కాయపల్లెలో పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాతోపాటు మాజీ మేయర్ సురేశ్ బాబు పరిశీలించారు.

పట్టణ ప్రాంతాల్లో అవసరమైతే సెంటున్నర స్థలం ఇస్తాం..

ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లోని పేదలకు సెంటు స్థలం, గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర స్థలం ఇవ్వాలని నిర్ధేశించారు. అయితే పట్టణ ప్రాంతాల్లో అవసరమైన భూమి అందుబాటులో ఉంటే సెంటున్నర ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఉపముఖ్యమంత్రి బాషా అన్నారు. కడప జిల్లాలో లక్షా 5 వేల మంది అర్హులకు లక్షా 11 వేల 456 ఎకరాల భూమిని సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. కడప నగరంలో 22 వేల మందికి ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి... ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి నిర్వహించే రచ్చబండలో ఏ పేదవాడు కూడా ఇంటి స్థలం లేదని ఫిర్యాదు చేయకూడదని చెప్పారు.

ఇవీ చదవండి:

సాగర తీరంలో కరోనాపై అవగాహన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.