ETV Bharat / state

హైదరాబాద్​లో రోడ్డు ప్రమాదం.. కడప విద్యార్థిని మృతి - Kphb road accident updates

హైదరాబాద్ కేపీహెచ్​బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన ఓ వైద్య విద్యార్థిని మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Dental student killed in road accident
హైదరాబాద్​లో రోడ్డు ప్రమాదం.. కడప విద్యార్థిని మృతి
author img

By

Published : Feb 21, 2021, 12:15 PM IST

హైదరాబాద్ కేపీహెచ్​బీ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మియాపూర్‌ నుంచి జేఎన్​టీయూ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వైద్య విద్యార్థినిని ఇసుక లారీ ఢీకొట్టగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కడప జిల్లా బద్వేల్​కు చెందిన ఆదిరష్మిగా గుర్తించారు.

ఆమె హైదరాబాద్​లోని ఓ కళాశాలలో దంత వైద్య విద్య చదువుతోంది. రాత్రి సమయంలో మియాపూర్​లో సినిమా చూసి వస్తుండగా... మెట్రో పిల్లరు 660 దగ్గర ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీచూడండి: కోర్టు భవనాల నిర్మాణానికి బాధ్యత వహించాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.