సమస్యల సాధన కోసం కడప జిల్లా చెవి, మూగ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ధర్నా చేశారు. చేతుల ద్వారానే తమ సమస్యలు తెలియజేశారు. 2019-20 సంబంధించి శాఖల వారీగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలానే 2016-17, 2017 -18 ఏడాదికి సంబంధించిన బ్యాక్ లాగ్ ఖాళీలు అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలని కోరారు. విశ్వవిద్యాలయాలు, ఆర్టీసీ, విద్యుత్ తదితర ప్రభుత్వ సంస్థల్లో సర్వేల ప్రకారం మూగ చెవిటి వారికి తక్షణం నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విభిన్న ప్రతిభావంతులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. బధిరులకు జిల్లా కార్యాలయం కేటాయిస్తే తమ సమస్యలను పరిష్కరించుకుంటామని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి