కడప జిల్లాలో రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కంపచెట్లు కప్పేశాయి. ఫలితంగా వాహనచోదకులు వాటిని గుర్తించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. బద్వేలు నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి ఇలానే ఉంది. రోడ్లు భవనాల శాఖ అధికారులు రహదారులకు ఇరువైపులా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. కానీ కంపచెట్లు సిగ్నల్స్‌కు అడ్డుగా దట్టంగా పెరగటంతో అవి వాహనచోదకులకు కనిపించడం లేదు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రహదారిపై ప్రయాణం సాగించాలంటే భయంగా ఉంటుందని వాహనచోదకులు చెప్తున్నారు.
ఇదీ చూడండి: రహదారి గుంతలమయం... గిరిజనుల అయోమయం