ప్రొద్దుటూరులో ఇద్దరు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 4.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ దస్తగిరిపేటకు చెందిన మరో ప్రధాన బుకీ షబ్బీర్ అలియాస్ ఎతూ అనే వ్యక్తి వద్ద పందేలు కట్టేవారు. ఆ బుకీ సూచనల మేరకు వారిద్దరూ ప్రొద్దుటూరులో క్రికెట్ పందాలు నిర్వహించేవారని ఎస్సై శివశంకర్ తెలిపారు. బెట్టింగ్‌కు సంబంధించిన డబ్బులు పంచుకుంటుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చదవండి :