ETV Bharat / state

అక్కడ ఏ ఫార్మాట్ మ్యాచ్ అయినా సరే.. బెట్టింగ్ జరగాల్సిందే!

క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు.. బెట్టింగ్ నిర్వహణకు తెర లేపుతారు బెట్టింగ్ రాయుళ్లు. కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాకు చెందిన బెట్టింగ్ రాయుళ్లు.. బెంగళూరు, గోవా, హైదరాబాద్​కు చెందిన ప్రధాన నిర్వాహకులతో ఆన్​లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నట్లు తెలిసింది. 31 మంది క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు... వారంతా ఐపీఎల్ సీజన్​లో 34 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు విచారణలో తేలింది.

అక్కడ ఏ ఫార్మాట్ మ్యాచ్ అయినా సరే బెట్టింగ్ జరగాల్సిందే!

author img

By

Published : Dec 16, 2020, 7:29 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఇండియా క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు... అది ఏ ఫార్మాట్ మ్యాచ్ అయినా బెట్టింగ్ జరగాల్సిందే. ప్రొద్దుటూరులో వందలమంది క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు... బెంగళూరు, గోవా, హైదరాబాద్​కు చెందిన ప్రధాన నిర్వాహకులతో ఆన్​లైన్ అప్లికేషన్​లో పేర్లు నమోదు చేసుకుని బెట్టింగ్ చేస్తున్నట్లు కడప జిల్లా పోలీసులు గుర్తించారు. వీరంతా కమ్యూనికేటర్ ద్వారా లక్షల రూపాయల బెట్టింగ్ చేస్తున్నట్లు తేలింది.

జిల్లాకు చెందిన స్పెషల్ ఎన్ ఫోర్స్​మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ చక్రవర్తికి వచ్చిన సమాచారం మేరకు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లపై నిఘా పెట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు, గోవా, హైదారాబాద్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. 31 మంది క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసి ప్రొద్దుటూరులో కోర్టులో హాజరుపరిచారు. వీరిలో భీమవరం, హైదరాబాద్, కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు నిందితులు మినహా మిగిలిన వారంతా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందినవారేనని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఆరు నెలల పాటు క్రికెట్ బుకీల బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తే.. దాదాపు 34 కోట్ల రూపాయల లావాదేవీలు క్రికెట్ బెట్టింగ్ జరిపినట్లు వెల్లడైందన్న ఎస్పీ... బ్యాంకు ఖాతాల పుస్తకాలను ఐటీ శాఖకు అప్పగిస్తున్నామన్నారు.

క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే విషయం పోలీసులు కూడా గుర్తించలేని విధంగా బెట్టింగ్ రాయుళ్లు ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్​లో యాప్ తయారు చేసుకున్నారు. బెట్టింగ్ ఆడే వారంతా అందులో సబ్ స్క్రైబర్స్​గా నమోదు చేసుకుని బెట్టింగ్ చేసే విధంగా నిబంధనలు పెట్టుకున్నారు. లావాదేవీలన్నీ ఆన్​లైన్ ద్వారానే నిర్వహిస్తున్నారు. వారు నిర్వహిస్తున్న లొకేషన్ గుర్తించలేని విధంగా సాంకేతిక పరిజ్ఞానంతో కమ్యూనికేటర్​ను తయారు చేసుకుని బెట్టింగ్​కు పాల్పడుతున్నారు. వీరి వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి లక్ష రూపాయల నగదు, 34 కోట్ల రూపాయల లావాదేవీలు నడిపిన బ్యాంకు పాసు పుస్తకాలు, ఏడు ల్యాప్ టాప్​లు, సెల్ ఫోన్లు, ఆరు కిలోల గంజాయి, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.

ప్రొద్దుటూరులో ఎక్కువగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా... ఆ ప్రాంతంలో ఇంకా ఎవరెవరు క్రికెట్ బుకీలు ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: కర్నూలు రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.