కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ ప్రేమోన్మాది చేతిలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న యువతి లావణ్యను.. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పరామర్శించారు. లావణ్యకు ప్రభుత్వం వైద్యం చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఘటనకు గల కారణాలు తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారని అన్నారు.
యువతులకు రక్షణ లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి దాడులు జరగడం దారుణమని ఖండించారు. తక్షణం సునీల్‌తో పాటు అతని గ్యాంగ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: