గోకులం బిల్లుల కోసం సీపీఐ నాయకుల ర్యాలీ
సారూ.... గోకులం బిల్లులు చెల్లించండి! - cpi leaders rally due to gokulam bill at rayachoti
పశువుల కోసం నిర్మించే గోకులం షెడ్ల బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఎం. విశ్వనాథ పేర్కొన్నారు. కడప జిల్లా రాయచోటిలో పశుసంవర్ధక శాఖ కార్యాలయం సీపీఐ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. 779 మంది రైతులు మినీ గోకులం షెడ్లు నిర్మించుకొని బిల్లుల కోసం ఎదురుచూస్తున్నా .... స్థానిక ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పట్టించుకోకపోవడం దారుణమనన్నారు. లబ్ధిదారుల వివరాల ప్రభుత్వానికి అందజేశామని ...నిధులు రాగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పశువైద్యాధికారుడు రమేష్ పేర్కొన్నారు. ర్యాలీ అనంతరం రైతులు ఆయనకు వినతి పత్రం అందజేశారు.

గోకులం బిల్లుల కోసం సీపీఐ నాయకుల ర్యాలీ
గోకులం బిల్లుల కోసం సీపీఐ నాయకుల ర్యాలీ