వర్షాకాలం దోమల ఉద్ధృతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా మైదుకూరులో పురపాలక సంఘం కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. స్థానికులతో కలిసి కార్యాలయం వద్దకు చేరుకున్న నేతలు పురపాలక అధికారుల తీరును తప్పుబట్టారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు చేపట్టకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి :