కడప జిల్లాలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బస్టాండ్ పరిసరాలు, బస్సుల్లో ప్రత్యేక యంత్రం ద్వారా హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయిస్తున్నారు. బస్సులు సాయంత్రం రాగానే పిచికారీ అనంతరం గ్యారేజీలోకి పంపిస్తున్నారు. మరమ్మతుల అనంతరం మరోసారి పిచికారీ చేసిన తర్వాతే బస్సులు బయటకు తీస్తున్నారు. జిల్లాలోని అన్ని డిపోల్లో ఇదే విధానాన్ని అమలు పరుస్తున్నారు.
ఇదీ చదవండి: