గతేడాది కరోనా బిగించిన పిడికిలి నుంచి ఇంకా పూర్తిగా బయట పడకముందే... చేనేత పరిశ్రమపై తన పట్టును వైరస్ మరికాస్త బిగించటంతో కార్మికులు కష్టాల్లో పడ్డారు. కడప జిల్లాలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా కార్మికులు నేతనే నమ్ముకుంటారు. జిల్లా వ్యాప్తంగా 15వేలకు పైగా మగ్గాలు ఉండగా... వీటిపై 50 వేలమంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో ఇదే ప్రధాన పరిశ్రమ. ఇక్కడ తయారైన చీరలు.... దక్షిణాదిన అన్ని రాష్ట్రాలకూ ఎగుమతవుతాయి. కరోనా రెండో దశ కారణంగా వ్యాపారం లేక... కోట్ల విలువైన లక్షల చీరలు నిల్వ ఉండిపోతున్నాయి. సరకు అమ్ముడైతే తప్ప కూలి రాని పరిస్థితుల్లో... కార్మికులు, మాస్టర్ వీవర్లు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తమ సరకు అమ్ముడయ్యేలా చూడాలని కార్మికులు... ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చదవండి: