ETV Bharat / state

'మరింత పటిష్ఠంగా కరోనా నివారణ చర్యలు'

కడపలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కొవిడ్ సోకిన ప్రాంతాన్ని మూడు జోన్లుగా విభజించామని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నిషేధం కొనసాగుతుందని వెల్లడించారు.

Coronation prevention measures more positive in kadapa saying to collecter harikiran
కడప జిల్లాలో మరింత కఠినంగా లాక్​డౌన్
author img

By

Published : May 6, 2020, 11:35 PM IST

కంటైన్మెంట్ క్లస్టర్లలో కరోనా నివారణ చర్యలను మరింత పటిష్ఠంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన “కొవిడ్ ఇన్​ స్టంట్ ఆర్డర్ -43లోని అంశాలను, విధి విధానాలను తప్పక పాటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మే 3వ తేదీన జారీ చేసిన “కొవిడ్ ఇన్​స్టంట్ ఆర్డర్ -43” ప్రకారం.. కరోనా పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి ఇంటి కేంద్రంగా, 500 మీటర్లు నుంచి ఒక కిలోమీటర్ ప్రాంతాన్ని “కంటైన్మెంట్ కోర్ గానూ... 3 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని “కంటైన్మెంట్ బఫర్​గా నిర్ధారించామని వివరించారు. ఈ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలు, మండలాల్లో కంటైన్మెంట్ జోన్​ల వివరాలను కలెక్టర్ వెల్లడించారు.

ఇదీచదవండి.

'కడపను కరోనా రహితంగా తీర్చిదిద్దేందుకు సహకరించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.