కడప జిల్లా బద్వేలు నెల్లూరు రోడ్డులోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో బాధితులు నిరసనకు దిగారు. మధ్యాహ్నం చేసిన కూరలే రాత్రికి వేడి చేసి ఇస్తున్నారని బాధితులు తెలిపారు. ఈ క్వారంటైన్లో వృద్ధులు ఉన్నారని... వారు ఎలా ఉంటారని నిలదీశారు. కనీస సౌకర్యాలు అందించడంలేదని, శానిటైజర్లు లేవని తెలిపారు. ఇంకొన్నాళ్లు ఇక్కడే ఉంటే కొత్త రోగాలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గృహ నిర్బంధంలో ఉంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని అంటున్నారు.
ఇదీచూడండి. కువైట్‌లో కష్టాల్లో 1900 మంది ప్రవాసాంధ్రులు