కరోనాతో చనిపోయిన మృతదేహలను ఆసుపత్రిలో అలాగే ఉంచుతున్నారు. కడప రిమ్స్ కోవిడ్ వార్డులో ఓ వక్తి మరణించగా..అతని శవాన్ని అక్కడినుంచి తీయనేలేదు అక్కడి సిబ్బంది. ప్రతి రోజు శవాల మధ్య భయపడుతూ తిరుగుతున్న కరోనా బాధితులు..... అటెండర్లు, సిబ్బందికి తరలించమని మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. 5 వతేదీ సాయంత్రం 5 గంటల సమయంలో తీవ్ర అనారోగ్యంతో వార్డులోకి వచ్చిన రోగి...చనిపోయారు. రెండు గంటల తర్వాత శవాన్ని తరలించారు. చనిపోయిన తర్వాత కనీసం బెడ్‌ను కానీ, వార్డును శానిటైజ్ చేయలేదు. అదే పడకపై శానిటైజ్ చేయకుండా... మరో రోగిని చేర్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి. మూడు రోజుల్లో ఒకరు తరువాత ఒకరు.. భార్య, భర్త ఆత్మహత్య