ETV Bharat / state

600కు చేరువలో కరోనా కేసులు

author img

By

Published : Jun 23, 2020, 7:45 AM IST

కడప జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. సోమవారం 32 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకూ కరోనా బారినపడిన వారి సంఖ్య 560కు చేరింది.

corona increasing in kadapa dst total caas still now is reasched to  five hundered and sixty

కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండటంతో జిల్లా ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఆదివారం 43 కేసులు రాగా... సోమవారం 32 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు 560 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

200 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. సోమవారం నమోదైన 32 కేసుల్లో... ప్రొద్దుటూరు-14, వల్లూరు-4, కడప-3, పుల్లంపేట-2, ముద్దనూరు-1, దువ్వూరు-1, ఖాజీపేట-1, బద్వేలు-1, పులివెందుల-1, పెద్దముడియం-1, విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన ముగ్గురికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.

కడప నగరానికి చెందిన 60 ఏళ్ల వృద్దుడు పదిరోజుల కిందట కరోనా పాజిటివ్ రావటంతో తిరుపతి కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఈరోజు తిరుపతిలో మృతిచెందాడు. కువైట్ నుంచి జిల్లాకు వచ్చిన 113 మందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి

సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుపై హైకోర్టులో పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.