కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల 15 వ తేదికి ముందు వరకూ ఒక్క కేసు కూడా ఇక్కడ నమోదు కాలేదు. ఇప్పుడు ఎర్రగుంట్లలో వరుసగా కరోనా పాజిటివ్ కేసులు దాఖలవుతున్న తీరు ఈ ప్రాంత ప్రజలను భయపెడుతోంది.
పొరుగున ఉన్న పసిడిపురి నుండి ఇక్కడికి సోకిన తొలి భాధితులనుంచి మరో ముగ్గురికి... అ ముగ్గరి నుంచి మరి కొందరికీ వ్యాధి సోకిదంని ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. కింది స్థాయి అధికారులకు పలు సూచనలు సలహాలు చేస్తున్నారు. సామాజిక దూరం వ్యక్తిగత శుభ్రత పరిసరాల సంరక్షణే సమస్యను అధిగమించేందుకు మార్గమని స్పష్టం చేస్తున్నారు.
ఇవీ చదవండి: