కడప జిల్లా జమ్మలమడుగు మండలం ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో.. కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గండికోట శివారులోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ఆవరణలో మొదటి రోజు వందమందికి కరోనా టెస్టులు చేశారు. వీరిలో ఏడుగురు పోలీసులు సైతం ఉన్నారు.
గండికోట గ్రామానికి పర్యటకులను, ప్రజలను రానివ్వకుండా రహదారులను దిగ్బంధం చేశారు. మలుపు వద్ద, కొట్టాలపల్లి వద్ద రహదారులకు అడ్డంగా షామియానాలు వేసి పోలీసులు పహారా కాస్తున్నారు. గండికోటతో పాటు జమ్మలమడుగు పట్టణంలోనూ జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు సీఐ మధుసూదన్ రావు తెలిపారు.