ETV Bharat / state

కడపలో కరోనా తగ్గుముఖం.. 4 రోజుల్లో ఒకే కేసు నమోదు - కరోనా వార్తలు

కడప జిల్లాలో కరోనా కాస్త తగ్గు ముఖం పడుతుండటం కొంత ఊరట కలిగిస్తోంది. గడచిన నాలుగు రోజులుగా ఒక్క కేసు మాత్రమే నమోదు కావడంపై.. ప్రజల్లోనూ ఆందోళన తగ్గింది.

corona-cases-dicreased
కడపలో తగ్గుముఖం పడుతున్న కరోనా
author img

By

Published : May 12, 2020, 2:11 PM IST

కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం కాస్త ఊరట కల్గించే అంశం. గడచిన నాలుగు రోజులుగా జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది. కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల్లోనే అడపా దడపా కేసులు వెలుగుచూస్తున్నాయి.

మిగిలిన పది ప్రాంతాల్లో 20 రోజుల నుంచి కేసులు నమోదు కాకపోవడంపై ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 97 పాజిటివ్ కేసులు నమోదు కాగా 45 మంది డిశ్చార్జ్​ అయ్యారు. 52 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 16,449 నమూనాలు సేకరించగా 1398 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

ఇవీ చూడండి:

'పేదకళాకారులను ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ ఆదుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.