కడప జిల్లా రాయచోటి పురపాలికలో 12 వ వార్డు మెనార్క్ వీధిలో ముంబయి నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లుగా వైద్యులు నిర్ధారించారు. బాధితుడి ఇంటి నుంచి 200 మీటర్ల వరకు కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షల నిమిత్తం కడప ఫాతిమా మెడికల్ కళాశాలకు తరలించారు. ఆ ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, కమిషనర్ రాంబాబు, సీఐ రాజు, వైద్యాధికారులు వివరించారు.
ఇదీ చదవండి:
ఏలూరులో వైద్య విద్యార్థి మృతి...కరోనాకు సంబంధించిన ఔషధాలు లభ్యం