ETV Bharat / state

సీఎం సొంత నియోజకవర్గంలో లోపించిన శాంతిభద్రతలు.. - కడప జిల్లా తాజా వార్తలు

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే శాంతి, భద్రతలు లోపించాయని విమర్శించారు. కడప జిల్లాలో ఇప్పటికే.. దాదాపు 10 మంది హత్యకు గురయ్యారని అన్నారు.

Congress party leaders Tulsi Reddy
కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి
author img

By

Published : Jul 28, 2021, 5:23 PM IST

రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం రావణ కాష్ఠంగా మారిందని విమర్శించారు. ప్రత్యర్థుల మీద దాడులు నిత్యకృత్యాలయ్యాయని అన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని సొంత నియోజకవర్గం పులివెందులలో గత ఏడాది ఆగస్టు 8న శివరాణి , ఆగస్టు 21 న వీరమ్మ అనే మహిళ, డిసెంబర్ 7న పెద్దకుడాల గ్రామంలో నాగమ్మ, ఈ సంవత్సరం జూన్ 15న నల్లపురెడ్డి పల్లెలో శివప్రసాదరెడ్డి, పార్థసారథి రెడ్డి, జులై 15, జులై 27 న కుళాయప్ప, మునెప్పలను హత్య చేశారని అన్నారు. జమ్మలమడుగులో గురుప్రతాప్​రెడ్డి, పొద్దుటూరులో నందం సుబ్బయ్య హత్యకు గురయ్యారని తెలిపారు. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైకాపా కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేయటం దారుణమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించటం ప్రభుత్వ కనీస బాధ్యత అని గుర్తు చేశారు.

ఇదీ చదవండీ.. Tdp Leaders House Arrest: తెదేపా నేతల గృహ నిర్భంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.