ETV Bharat / state

Congress Leader Tulasi Reddy Press Meet On Kadapa Steel Plant: "కడప ఉక్కు ఆంధ్రుల హక్కు".. ఈ నెల 6న కాంగ్రెస్ బహిరంగ సభ - Kadapa steel is the right of the Andhras

Congress Leader Tulasi Reddy Press Meet On Kadapa Steel Plant: వైఎస్సార్ జిల్లాలో కడప ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు అన్ని రకాల వసతులు ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్లక్ష్యం వహిస్తున్నాయని తులసి రెడ్డి ధ్వజమెత్తారు. ఈ నెల ఆరో తేదీన కడపలో "కడప ఉక్కు ఆంధ్రుల హక్కు" అనే నినాదంతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Congress_Leader_Tulasi_Reddy_Press_Meet_On_Kadapa_Steel_Plant
Congress_Leader_Tulasi_Reddy_Press_Meet_On_Kadapa_Steel_Plant
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 1, 2023, 7:46 PM IST

Updated : Oct 1, 2023, 7:53 PM IST

Congress Leader Tulasi Reddy Press Meet On Kadapa Steel Plant: "కడప ఉక్కు ఆంధ్రుల హక్కు".. ఈ నెల 6న కాంగ్రెస్ బహిరంగ సభ

Congress Leader Tulasi Reddy Press Meet On Kadapa Steel Plant : "అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని" అన్న చందంగా కడప ఉక్కు కర్మాగారం పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా సంస్థ చైర్మన్ తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్సార్ జిల్లాలో కడప ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు అన్ని రకాల వసతులు ఉన్నాయి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం చిత్తశుద్ధి లేకపోవడం వలనే ఉక్కు కర్మాగారం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Congress Public Meeting on September 6th for Kadapa Steel Plant Issue in Kadapa : వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు కృషి చేస్తామని, ఈ నెల ఆరో తేదీన కడపలో "కడప ఉక్కు ఆంధ్రుల హక్కు" అనే నినాదంతో పీసీసీ సభ్యులు పల్లంరాజు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రుద్రమరాజు తదితర రాష్ట్ర నాయకులచే పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తులసి రెడ్డి తెలిపారు. కడపలో పార్టీ కార్యాలయంలోని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Dharna For Kadapa Steel Plant: కడప ఉక్కు కర్మాగారం కోసం అఖిలపక్ష నేతల ధర్నా

Tulasi Reddy Fire on YSRCP Government : విభజన చట్టంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా, రాయలసీమలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని హామీ ఇచ్చారని తులసి రెడ్డి గుర్తు చేశారు. కానీ ఆ హామీని అమలు పరచడంలో ఇప్పుడున్న బీజేపీ సర్కార్, వైసీపీ సర్కార్​లు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మాట మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై మొదటి సంతకం పెడతారని ఆయన హామీ ఇచ్చారు.

Tulasi Reddy fires on AP Capital Shifting to Vizag: విశాఖకు రాజధాని తరలింపు.. రాయలసీమకు తీరని నష్టం : తులసిరెడ్డి

కాంగ్రెస్​కి ఓట్లు వేసి గెలిపించండి.. ప్రత్యేక హోదా, కడపకు ఉక్కు కర్మాగారం ఇస్తాం : రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపల కడపలో ఉక్కు కర్మాగారం పనులు మొదలు పెడతామని, ఒకటి రెండు సంవత్సరాలలోపు ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి దాని ఫలాలు అన్ని రాయలసీమ ప్రాంత వాసులు అందే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. త్వరలో ఎన్నికలు రానున్నాయని మళ్లీ కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో వైసీపీకు ఓటు వేస్తే తిరిగి యదార్థ పరిస్థితి తప్పదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా, కడపకు ఉక్కు కర్మాగారం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని తులసి రెడ్డి పిలుపును ఇచ్చారు.

"అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని" అనే సామెత కడప ఉక్క కర్మగారానికి సరిపోతుంది. ఉక్క కర్మగారానికి అన్ని వసతులు ఉన్నాయి. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న వైసీపీ నిర్లక్ష్య వహిస్తున్నాయి. ఈ నెల ఆరవ తేదీన "కడప ఉక్కు ఆంధ్రుల హక్కు" అనే నినాదంతో భారీ ర్యాలీ, బహిరంగ నిర్వహిస్తున్నాము."- తులసి రెడ్డి, కాంగ్రెస్ నేత

Congress Leader Tulasi Reddy Fires On Narendra Modi Over Bifurcation: "విభజన సరిగ్గా లేకపోతే బీజేపీ ఎందుకు సహకరించింది"

Last Updated : Oct 1, 2023, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.