ETV Bharat / state

ఆ మూడు బిల్లులు తేనె పూసిన కత్తులు: తులసిరెడ్డి

author img

By

Published : Sep 26, 2020, 3:18 PM IST

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులతో కార్పొరేట్ సంస్థలకు తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. అవి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు.

congress leader tulasi reddy about agricultural bills
తులసిరెడ్డి, కాంగ్రెస్ నేత

కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ బిల్లులు రైతులకు, వినియోగదారులకు తీవ్ర నష్టం కల్గిస్తాయని కాంగ్రెస్ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఈ బిల్లులు తేనె పూసిన కత్తిలాంటివని స్పష్టం చేశారు. రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించకుండా... విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అధికార పక్షం మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదించుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.

ఈ బిల్లుల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ప్రధాని మోదీ పైకి చెబుతున్నా... కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ప్రయోజనం కల్గించే విధంగా ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. రైతులకు ఉపయోగపడని వ్యవసాయ బిల్లులకు ఆమోదముద్ర వేయకుండా చూడాలని కాంగ్రెస్ సహా 20 పార్టీలు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాయని ఆయన గుర్తు చేశారు.

ఇవీ చదవండి:

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్​ వీడ్కోలు సభ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.