ETV Bharat / state

'ప్రభుత్వం గెలిచినా ఓడినట్లే... ప్రతిపక్షాలు ఓడినా గెలిచినట్లే'

author img

By

Published : Mar 12, 2020, 5:27 PM IST

నామినేషన్ల సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ తులసిరెడ్డి మండిపడ్డారు. వైకాపా నాయకుల దాడులను తీవ్రంగా ఖండించారు.

thulasi reddy speaks on ycp attacks
మాచర్ల ఘటనపై మాట్లాడిన కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ తులసిరెడ్డి
నామినేషన్ల ప్రక్రియలో దాడులపై కాంగ్రెస్​ నేత తులసిరెడ్డి స్పందన

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఐసీయూలో ఉందంటూ కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు​ తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్లలో తెదేపా నేతలపై జరిగిన దాడులను ఆయన ఖండించారు. ఎక్కడైనా పోలింగ్ సమయంలో కొన్ని చెదురు మదురు సంఘటనలు జరగుతుంటాయి. కానీ ఈసారి ఏకంగా నామినేషన్ల రోజే దాడులు చేయడమంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని వ్యాఖ్యానించారు. తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి రౌడీ రాజకీయం చూడలేదన్నారు. రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా ఇవ్వకుండా, అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా అధికారులు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఎన్నికలు నిర్వహించడం కన్నా... నామినేషన్ పద్ధతిలో ప్రభుత్వమే ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం గెలిచినా ఓడినట్లేనని... ప్రతిపక్షాలు ఓడినా గెలిచినట్లుగా భావించాలన్నారు.

ఇదీ చదవండి:

మేయర్ అభ్యర్థిత్వం దక్కలేదని మంత్రి ఇంటి ముందు ఆందోళన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.