కడప జిల్లా ప్రొద్దుటూరు ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముప్పు తప్పింది. గత రెండు మూడు రోజులుగా కురిసిన వర్షానికి కళాశాలలోని గదులు తడిసి ముద్దయ్యాయి, ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం కళాశాలలోని కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం గదులు పూర్తిగా కూలిపోయాయి. పైకప్పు విరిగి కింద పడింది. దీంతో గదుల్లో ఉన్న కంప్యూటర్లు పుస్తకాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఆ సమయానికి ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కళాశాలలోని మిగిలిన గదులు శిథిలావస్థకు చేరడంతో అధ్యాపకులు, విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు కూలుతాయోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఇదీ చదవండి: ఏపీ: మరో 10, 392 మందికి కరోనా... 4,55,531కు పెరిగిన బాధితులు