2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగవారికి 919 మంది ఆడవారు మాత్రమే ఉన్నారని, మహిళల సంఖ్యను పెంచడానికి అధికారులు ఎన్జీవోలు ప్రజలు అందరూ భాగస్వామ్యం వహించాలని కలెక్టర్ సి. హరికిరణ్ సూచించారు. కలెక్టరేట్లో గర్భస్థ లింగ నిర్ధారణ, మాతా శిశు మరణాలు అంశాలపై జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తో కలిసి జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆడబిడ్డను కాపాడుకుందామని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో లింగ నిర్ధారణపై ప్రభుత్వం నిర్దేశించిన చట్టాన్ని తప్పక అమలు చేయాలని ఆదేశించారు. ఆడబిడ్డను రక్షించుకోవాలంటే మొదటగా లింగనిర్ధారణ జరగకుండా చేయాలని దీనిపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఇందులో అంగన్వాడీ వర్కర్, ఆయా, ఏఎన్ఎం, ఆశ, మహిళా సంరక్షణ కార్యదర్శులను భాగస్వామ్యం వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి...