BJP MP CM Ramesh Shocking Comments on YCP Govt: రాష్ట్రంలో మద్యం కుంభకోణంలో అధికార వైసీపీకి చెందిన కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు అనేకమంది వైసీపీ నాయకులకు సంబంధం ఉందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు. మద్యం కుంభకోణంలో వైసీపీ హస్తం ఉందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. లిక్కర్ విషయంలో గతంలో ప్రభుత్వం చెప్పిన దానికి భిన్నంగా వ్యహరిస్తోందని ఆరోపించారు. వైసీపీ సలహా దారులు లిక్కర్ బిజినెస్ ను చెప్పు చేతుల్లో పెట్టుకున్నారని సీఎం రమేష్ ఆక్షేపించారు. డిస్లరీలను సైతం వైసీపీ ముఖ్య నాయకులే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. మద్యం అమ్మకాల ద్వారా ఏడాదికి 40 వేల కోట్ల పైనే వ్యాపారం చేస్తున్నారని సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతలు మద్యం వ్యాపారం ద్వారా రాష్ట్రాన్ని ఎలా దోపిడీ చేస్తున్నారో కేంద్రానికి పిర్యాదు చేశామని సీఎం రమేష్ తెలిపారు. దీనిపై లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన పేర్కొన్నారు. విద్యుత్ విషయంలో అధికారంలోకి రాక ముందు ఏం చెప్పారు.. వచ్చాక ఏం చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో లోపాయ కారి ఒప్పందాలపై విచారణ జరగాలని సీఎం రమేష్ డిమాండ్ చేశారు. రేపు అధికారం పోయాక ఈ అక్రమాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉంటుందని సీమ రమేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న షిరిడీ సాయి ఎలక్ట్రికల్ కు సోలార్, విద్యుత్ ప్లాంట్ లను కట్టబెడుతున్నారని ఆరోపించారు. వారికి ప్రభుత్వ భూములను దారా దత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైట్రోజన్ విషయంలో నూ అవక తవకలు జరిగాయనీ మండిపడ్డారు. ఇసుక టెండర్ విషయంలోనూ అనేక అక్రమాలు జరిగాయని.. గత అరు నెలలుగా టెండర్ లేకుండా ఎవరు ఇసుక సొమ్ము తీసుకుంటున్నారని సీఎం రమేష్ విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలు, అవినీతి చర్యలు, ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా బీజేపీ ఒక వీడియో తయారు చేస్తోందని సీఎం రమేష్ తెలిపారు. త్వరలో ప్రజల ముందు ఈ వీడియోలు బయట పెడతాం అన్న ఆయన... చిత్తూరు జిల్లాలో 90 కోట్ల ఇసుక, మట్టి మాఫియా జరిగిందని ఆరోపించారు. వైసీపీ అక్రమాల పై సీబీఐ, ఈడీ, ఇతర సంస్థలు దర్యాప్తు చేస్తాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖపట్నంలో సైతం పులివెందుల పెద్దలే అక్రమాలు చేస్తున్నారంటూ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.