కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేడు కొనసాగనుంది. అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. నేడు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉదయం 9 గంటలకు నివాళులు అర్పిస్తారు. అనంతరం చర్చిలో ప్రార్థనలు చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్, బస్సు డిపోలకు శంకుస్థాపన చేస్తారు. గండికోట-చిత్రావతి, గండికోట-పైడిపాలెం ఎత్తిపోతల పథకాల పనులు ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు ముద్దనూరు రోడ్డులోని ఏపీక్లార్‌లో ఇర్మా ఏపీకి శంకుస్థాపన చేయనున్న సీఎం.. అనంతరం అపాచీ లెదర్ డెవలప్‌మెంట్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. పులివెందులలో వైఎస్‌ఆర్ జగనన్న హౌసింగ్ లేఅవుట్ పరిశీలిస్తారు. రాత్రికి ఇడుపులపాయలో బస చేస్తారు.