తన సొంత నియోజకవర్గం పులివెందుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డితో సహా జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతోన్న అభివృద్ధి పనుల పురోగతిని సీఎం ఆరాతీశారు. పెండింగ్లోఉన్న పనులకు సంబంధించి ప్రతిపాదనలను అధికారులు సీఎం ముందుంచారు. వాటన్నింటినీ పరిశీలించిన జగన్.. వాటికి ఆమోదముద్ర వేసి, నిధులు మంజూరు చేశారు.
పులివెందులలో వైద్యకళాశాల
పులివెందులలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు సీఎం జగన్ అంగీకరించారు. డిసెంబర్‌లో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. వేముల మండలం నల్లచెరువుపల్లిలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అధికారులకు మార్గనిర్దేశాలు ఇచ్చారు. నియోజకవర్గంలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పులివెందుల ఏరియా ఆసుపత్రి, వేంపల్లి సీహెచ్‌సీకి రూ.30 కోట్లతో మౌలిక సౌకర్యాల కల్పన చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
పర్యాటక వలయంలో వైఎస్సార్ ఘాట్
పులివెందుల మున్సిపాలిటీకి భూగర్భ మురుగుకాల్వలు, ఎస్టీపీకి సుమారు రూ.50 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వేంపల్లిలో మిని శిల్పారామం ఏర్పాటుకు స్థలసేకరణ, నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శిల్పారామానికి రూ. 10 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న జగన్.. ఇడుపులపాయలో వైఎస్సాఆర్ ఘాట్, గండి క్షేత్రం, గండికోట, ఒంటిమిట్ట సహా ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్య్కూట్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
రబీ ఇన్సూరెన్స్ విడుదలకు ఆదేశాలు
2012-13 రబీ పంటకు సంబంధించి సుమారు రూ.112 కోట్లు ఇన్సూరెన్స్ బీమా సొమ్ము సత్వరమే రైతుల ఖాతాలోకి చేరేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. వేంపల్లిలో బీసీ బాలురు, బాలికల వసతి గృహం, ఎస్సీ బాలికల వసతి గృహం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయాలని ఆదేశించారు. పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో పులివెందులలో మాల్ కమ్ మల్టిప్లెక్స్ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాల్సిందిగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి :