విజయవాడ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సీఎం జగన్ కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. అధికారులు, మంత్రులు, పార్టీ నేతలు ముఖ్యమంత్రిని ఆత్మీయంగా పలకరించారు. అనంతరం సీఎం జగన్ ఇడుపులపాయలో హెలిప్యాడ్ నుంచి నడుచుకుంటూ సాయంత్రం 6.15 గెస్ట్ హౌస్కు చేరుకున్నారు.
కరోనా విజృంభిస్తున్న క్రమంలో ఇడుపులపాయలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ మేరకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకొని రేపు ఉదయం ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్లో నివాళులు అర్పించనున్నారు.
ఇదీ చదవండి: తెదేపా అధినేత చంద్రబాబుకు పోలీసుల నోటీసులు