జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు ఏడాదికి రూ.12,500 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రైతులకు ఇచ్చే నగదులో ఏ మాత్రం కోత విధించిన చూస్తూ ఊరుకోమన్నారు. ఎన్నికలకు ముందు 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 6,500 రూపాయలు ఇస్తామనడం దారుణమని ఖండించారు. ఇది రైతు భరోసా కాదని రైతు నిరాశ అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన పిచ్చి తుగ్లక్ కంటే ఎక్కువగా ఉందని ఆరోపించారు. గ్రామ సచివాలయం ఉద్యోగాల విషయంలో మొదటినుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని... అర్హులైన వారికి నియామక పత్రం ఇచ్చినప్పటికీ పోస్టులను ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం తన పాలనలో తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి: జిల్లాలో రెండో ర్యాంక్ వచ్చిన ఉద్యోగం రాలేదు...