Flexi Issue in Prodduturu : కడప జిల్లా ప్రొద్దుటూరులో అధికార వైకాపాలో ఫ్లెక్సీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే రమేశ్ యాదవ్‌పై.. వైకాపా పదో వార్డు కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి ఆరోపణలు గుప్పించారు.
ఎమ్మెల్యే రమేశ్.. నేరచరిత్ర గల వారని అన్నారు. తన కుటుంబానికి హాని చేస్తాడనే అనుమానం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల వివాదంలో ఆయన అనుచరుడు రఘనాథ్పై బ్లేడుతో గాయాలు చేసి.. ఆ కేసును తనపైకి నెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రమేశ్ యాదవ్ నేర చరిత్ర గురించి ఆయన వర్గీయులు తెలుసుకోవాలని కోరారు.
ఎమ్మెల్సీ నుంచి నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. నాపై హత్యాయత్నం కేసు పెట్టించాలని చూస్తున్నారు. రఘునాథ్‌కు బ్లేడుతో గాయాలు చేసి, నాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్సీ నేరచరిత్ర ఆయన అనుచరులు కూడా తెలుసుకోవాలి - లక్ష్మీదేవి, వైకాపా వార్డు సభ్యురాలు, ప్రొద్దుటూరు
ఇదీ చదవండి