కడప జిల్లా సుండుపల్లిలో మంగళవారం అధికార పార్టీలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. సుండుపల్లిలో జరిగిన ఆసరా సమావేశానికి ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే మేడ మల్లిఖార్జున్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డిలు హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం మండల పరిషత్ కార్యాలయంలోని మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యే , చైర్మన్లు హాజరయ్యేందుకు వెళ్లగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే మల్లికార్జున్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వర్గీయులు.. మండల ఇంఛార్జి బాధ్యతలపై నేతలను నిలదీసే ప్రయత్నం చేశారు. అధిక సంఖ్యలో ఉన్న ఇరువర్గాల నాయకుల మధ్య మాటల పెరిగి తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఎంపీ, ఎమ్మెల్యేలను కూడా పక్కకు నెట్టేశారు. 20 నిమిషాల పాటు జరిగిన ఘర్షణలో ఇరువురు స్వల్పంగా గాయపడినట్లు స్థానికులు పేర్కొన్నారు. రాయచోటి గ్రామీణ సీఐ లింగప్ప ఆధ్వర్యంలో పోలీసులు శ్రమించి ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత మండల సర్వసభ్య సమావేశం కొనసాగింది.
ఇదీ చదవండి: