కడప జిల్లా ప్రొద్దుటూరు (proddatur )లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ (mlc ramesh yadav ) వర్గీయులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ (MLC)గా బాధ్యతలు చేపట్టిన రమేష్ యాదవ్ ప్రొద్దుటూరుకి రావడంతో ర్యాలీ నిర్వహించారు. దీంతో గుంపులుగా ఉండటంతో పోలీసులు వారిని ప్రశ్నించారు ఈ నేపథ్యంలోనే వాగ్వాదం జరిగింది. ఇందుకు నిరసనగా రమేశ్ వర్గీయులు... నేలపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన రమేశ్ యాదవ్ తొలిసారిగా ప్రొద్దుటూరుకు వచ్చారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మైదుకూరు రోడ్డు మీదుగా వాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గవర్నర్ కోటలో తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటంపై రమేశ్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి