ETV Bharat / state

Badvel by poll: ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ: సీఈవో విజయానంద్‌

బద్వేల్ ఉపఎన్నిక( Badvel by poll 2021 news)పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్( chief electoral officer vijayanand news) వివరాలను వెల్లడించారు. ఇవాళ్టి నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.

chief electoral officer vijayanand
chief electoral officer vijayanand
author img

By

Published : Oct 1, 2021, 12:51 PM IST

Updated : Oct 1, 2021, 7:20 PM IST

బద్వేల్ ఉపఎన్నిక( Badvel by poll 2021)కు సంబంధించి ఇవాళ్టి నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్( chief electoral officer vijayanand) వెల్లడించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. నామినేషన్ సందర్భంలో ఒక్కరే వెళ్లి దాఖలు చేయాలని స్పష్టం చేశారు. ర్యాలీలను నిషేధించామని.. ఈనెల 30న పోలింగ్‌, నవంబర్‌ 2న లెక్కింపు ఉంటుందన్నారు. ఈనెల 8 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన ఉంటుందని చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 13 వరకు గడువు ఉందని వివరించారు. ఈవీఎంల(Electronic Voting Machines)కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.

Badvel by poll
ఎన్నికల షెడ్యూల్

'కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా నిబంధనలు పాటించాలి. ఎన్నికల ప్రచారంలో ద్విచక్ర వాహన, ఇతర ర్యాలీను నిషేధించాం. నామినేషన్‌ వేసే సమయంలో అభ్యర్థితో పాటు ఒక్కరే వెళ్లాలి. ఇండోర్‌లో 200 మంది, బహిరంగ ప్రదేశాల్లో 1000 మందికి మించి సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి లేదు. దీనిపై ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి, పోలీసుశాఖకు ఆదేశాలు ఇచ్చాం. ఇంటింటి ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లకూడదు. వీధులు, కాలనీల్లో నిర్వహించే సమావేశాల్లో 50 మందికి మించి ఉండరాదు. ఈ విషయాలను ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలకు సూచించాం' - విజయానంద్‌, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

ఎమ్మెల్యే మృతి.. ఉప ఎన్నిక అనివార్యం

బద్వేల్ శాసనసభ్యుడుగా గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 28వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు ఎంబీబీఎస్ చేస్తుండగా... మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కడపలో ఆర్థోపెడిక్ డాక్టర్​గా వెంకటసుబ్బయ్య కొంత కాలం సేవలందించారు. వైకాపా నుంచి 2019లో తొలిసారిగా బద్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వు అయిన కారణంగా.. మంచి సౌమ్యుడిగా పేరున్న డాక్టర్ వెంకట సుబ్బయ్యకు వైకాపా అధిష్ఠానం ఎమ్మెల్యే సీటు కేటాయించింది. రెండేళ్ల నుంచి ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు.. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. గత ఎన్నికల్లో వెంకటసుబ్బయ్యపై పోటీ చేసి ఓటమి పాలైన ఓబులాపురం రాజశేఖర్‌నే తెదేపా మరోసారి బరిలో నిలిపింది. ఇక అధికార వైకాపా.. వెంకట సుబ్బయ్య భార్య సుధను అభ్యర్థిగా ప్రకటించింది.

ఇదీ చదవండి

Badwel bypoll 2021: బద్వేల్ ఉపఎన్నిక.. తెదేపా అభ్యర్థి ఖరారు..వైకాపా నుంచి ఎవరంటే..!

Last Updated : Oct 1, 2021, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.