మూడు రోజుల పర్యటన నిమిత్తం తెదేపా అధినేత చంద్రబాబు రేపు చంద్రబాబు కడపకు వస్తున్నారని.. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన శ్రీనివాస సమావేశ మందిరానికి చేరుకుని... జిల్లావ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తారు. మొదటిరోజు మూడు నియోజకవర్గాలతో, రెండో రోజు ఏడు నియోజకవర్గాల నేతలతో ఓటమికి గల కారణాలపై సమీక్ష నిర్వహిస్తారు. వైకాపా వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. మూడోరోజు వైకాపా దాడిలో గాయపడిన కార్యకర్తలను, అక్రమ కేసులు బనాయించి జైల్లో ఉన్న కార్యకర్తలను చంద్రబాబు పరామర్శిస్తారు. మూడోరోజు మధ్యాహ్నం విజయవాడకు బయలుదేరి వెళ్తారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:బతుకు పోరాటం.. తీరం నుంచి దూరం!